Saturday, February 21, 2026
[t4b-ticker]

వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలి

వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు పట్టణ ప్రజలపై ఉండాలి

:కేఎల్ఆర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబు ప్రత్యేక పూజలు

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 21( ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ లో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు దేవాలయానికి ఆహ్వానించినట్టు కాలనీ వాసులు తెలిపారు. పూజల అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి అదేవిధంగా వార్డు కౌన్సిలర్స్ మామిడి రామారావు, చీమ నరేష్ లను శాలువా బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారాలతో పూర్తి చేస్తానని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, దేవాలయ కమిటీ అధ్యక్షులు నాగు బండి శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులు శ్రీనుబాబు, నెమ్మాది దేవమని, టిపిఎస్వి జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, లైటింగ్ ప్రసాద్, కేఎల్ఆర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular