కోదాడ,అక్టోబర్ 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న పచ్చిపాల వేణు యాదవ్ బలమైన యాదవ సామాజిక వర్గంకు చెందిన వేణు యాదవ్ ను ఆ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల కోదాడ బరిలో దింపాలని ఇప్పటికే నిర్ణయించినట్టు సమాచారం.ఈ రోజా లేదా రేపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అనే సమాచారం.పచ్చిపాల వేణు యాదవ్ వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉంటూ గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యార్థి విభాగం,యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేస్తూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు,రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి పరిమితమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోదాడ నియోజకవర్గంలో కార్యకర్తలు కాపాడుకుంటూ వస్తున్న క్రమంలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత పార్టీలో నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో మండల పార్టీ అధ్యక్షులు,గ్రామ శాఖ అధ్యక్షుల కమిటీలను నియమించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పచ్చిపాల వేణు యాదవ్
RELATED ARTICLES



