వైద్యురాలిపై దాడి చేసి హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 18:కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దాడి,హత్యాచారానికి నిరసనగా, కోదాడ ముస్లిం యూత్ తరఫున పట్టణంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హరి అన్న పదాన్ని మరచి పోయి,ఒక వైద్యురాలిపై దాడి చేసి హత్యాచారం చేయడం చాలా విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటివి జరగడం వలన భవిష్యత్తులో డాక్టర్ చదవడానికి మహిళలు ఎవరు ముందుకురారని అన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా దోషులపై కఠినమైన చర్యలు తీసుకోరావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.