వైద్య ఖర్చుల నిమిత్తం 10000 రూపాయల ఆర్థిక సహాయం
గుంజ లక్ష్మి కుటుంబానికి అండగా డా,,అంజి యాదవ్
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): అనంతగిరి మండల కేంద్రంలో బీసీ కాలనీలో
ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గుంజ లక్ష్మిని వారి నివాసంలో పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం 10000ల రూపాయలు ఆర్థిక సాయం అందించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే డా,, మల్లెబోయిన అంజి యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ కుటుంబానికి అన్నివేళలా అండదండలుగా ఉంటామని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన లక్ష్మి కుటుంబం నిరుపేద కుటుంబంను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంజి యాదవ్ వెంట 1 వార్డు మెంబర్ కోమెరా మౌలిక శ్రీకాంత్, 5 వార్డ్ మెంబర్ కతిమాల వెంకన్న, కోమెరా లింగయ్య తదితరులు పాల్గొన్నారు.



