Monday, July 7, 2025
[t4b-ticker]

వ్యవసాయంలో పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించాలి…

వ్యవసాయంలో పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించాలి…

:ఫ్యాక్ట్ ( FACT) భారత ప్రభుత్వ రంగ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకర్…

కోదాడ,జులై 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:వ్యవసాయంలో రైతులు రసాయనక ఎరువులు,పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించాలని భారత ప్రభుత్వ రంగ సంస్థ ది ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రవన్కోర్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీకర్ తెలిపారు.గురువారం స్థానిక రేడియో గురువు 90.4 ఎఫ్ఎం రైతన్న కార్యక్రమం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఆమోదం పొందిన పీఎం ప్రనామ్ పథకం గురించి రైతులకు వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఎం ప్రనామ్ పథకం ద్వారా భూమాతను సొంత తల్లిలా చూసుకోవడం,భూమిని ఆరోగ్యంగా ఉంచడం,తద్వారా భూమాత యొక్క పోషణ,మెరుగుదల, పునరుద్ధరణ కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రైతులు వ్యవసాయంలో రసాయనిక ఎరువులు,పురుగుమందుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించాలన్నారు.పంటలలో అనేక రసాయనాల వాడకం వల్ల మానవజాతి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు.నేల యొక్క పోషణ భద్రత కోసం భూసార ఆధారిత ఎరువులని వినియోగించాలని,సేంద్రియ ఎరువుల వినియోగం ఎంతో అవసరం అన్నారు.ఆర్గానిక్ కంపోస్ట్ వాడటం వలన నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుందని నేల గుల్లబారడానికి నెలలో సూక్ష్మజీవులని పెంచడానికి ఉపయోగపడుతుందన్నారు.పీఎం ప్రనామ్ ప్రోగ్రాం ద్వారా భవిష్యత్ తరాలకు సుస్థిర వ్యవసాయం ఆరోగ్యవంతమైన నేలను అందించాలని ఈ కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రోత్సహిస్తుందన్నారు.సహజ వనరుల సంరక్షణలో భాగంగా మైక్రో ఇరిగేషన్, మల్చింగ్,జీరో టిలేజ్ ఫార్మింగ్,పంట మార్పిడి వంటి వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించాలని రైతుల్ని కోరారు.దీనివల్ల భూసారం పెరుగుతుంది.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుంది అన్నారు.ఆర్గానిక్ ఎరువును ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా పోషకాల మోతాదు పెరుగుతుందనీ,మొక్కకు కావాల్సిన రూపంలో పోషకాలు అందుతాయని పంట పెరుగుదల,రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని రైతులకు వివరించారు.రైతులు భూసార పరీక్షలు ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలని,పంట మార్పిడి పద్ధతి ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.ఫ్యాక్ట్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా ఏటా పదివేలు పైగా రైతు పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి నేలలోని పోషకాలను రైతులకు తెలియజేస్తుందన్నారు.ముఖ్యమైన పోషకాలు అయిన నత్రజని,భాస్వరం,పొటాషియం ఆహార పంటలకు 4:2:1నిష్పత్తిలో వాడమని సిఫార్సు చేస్తుండగా,రైతులు మాత్రం భాస్వరం పొటాష్ సిఫార్సు చేసిన దానికన్నా తక్కువగాను,నత్రజని పోషకాన్ని సిఫార్సు చేసిన దానికన్నా రెండు నుంచి రెండున్నర రేట్లు అధికంగా వాడుతున్నారని దీనివల్ల పోషకాల సమతుల్యత నెలలో దెబ్బతింటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్యాక్ట్ ఖమ్మం జిల్లా సీనియర్ ఆఫీసర్ శ్రావణ్,రేడియో గురు 90.4 ఎఫ్.ఎం ఫౌండర్ డైరెక్టర్ బాదే రాము పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular