వ్యవసాయ శాఖ అధికారులు,కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్తలు పంటలు పరిశీలన
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,అక్టోబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్)చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు డీఏవో శ్రీధర్ రెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్త్రవేత్తలు గురువారం వరి పంటను సందర్శించడం జరిగింది.ప్రస్తుతం వరి పంట గింజ పాలుపోసుకునే,గింజ గట్టిపడే దశలో ఉన్నది.గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు చీడ పీడలు ఆశించడం జరిగింది.ఈ సందర్శనలో భాగంగా వరి పంటలో సుడి దోమ,కాటుక తెగులు,ఎండు ఆకు తెగులు,పొట్ట కుళ్ళు గమనించడం జరిగింది.సుడి దోమ నివారణకు ఆశించిన పంటను ఎండబెట్టి ఎకరానికి వేప నూనె 1 లీటరు,పైమెట్రోజైన్ 120గ్రా/ఎకరం లేదా ఎతిప్రోల్+ పైమెట్రోజైన్ 170గ్రా/ఎకరం లేదా ట్రైఫ్లుమేజోపైరిం 94 మి.లీ/ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.కాటుక తెగులు నివారణకు ప్రోపికోణజోల్ 200 మి.లీ/ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.పొట్ట కుళ్ళు నివారణకు ట్రై ఫ్లోక్సీ స్ట్రోబిన్ + టెబుకోణజోల్ 80 గ్రా/ ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.ఎండు ఆకు తెగులు నివారణకు స్ట్రెప్టోమైసిన్ లేదా ప్లాంటమైసిన్ లేదా అగ్రోమైసిన్ 80 గ్రా/ ఎకరానికి 200 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి.ఈ కార్యక్రమంలో అధికారులు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎల్లయ్య,మండల వ్యవసాయ అధికారి శ్రీధర్,వ్యవసాయ విస్తరణాధికారి చంద్రశేఖర్,కేవీకే శాస్త్రవేత్తలు ఏ కిరణ్,మృత్తిక శాస్త్రవేత్త,డి ఆదర్శ్,సస్య రక్షణ శాస్త్రవేత్త,రైతులు నాగేశ్వరరావు, శ్రీను,వీరస్వామి,ప్రభాకర్ రెడ్డి,మహేష్ తదితరులు పాల్గొన్నారు.