కోదాడ,ఆగష్టు 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల స్వచ్ఛంద సేవా సంస్థ గత 15 సంవత్సరాలుగా వికలాంగులను,అనాధలను చేరదీసి సేవ చేయడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం వసంతపురం గ్రామ సర్పంచ్ పులిగండ్ల శ్రీనివాసరావు, జానకి దంపతులు అనాధ పిల్లలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల పేరుతో డబ్బు వృధా చేయకుండా అనాధలకు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకు రావాలన్నారు.మానసిక వికలాంగులను అనాధలను చేరదీసి సేవ చేస్తున్న శనగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు శనగల జగన్ మోహన్ ను సంస్థ సిబ్బందిని ఈ సందర్భంగా వారు అభినందించారు.అనాధాశ్రమానికి తన వంతు సహాయ సహకారాలుతప్పక అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవిత రాదా రెడ్డి, మేకల వెంకట్రావు,పోటు రంగారావు,తీగల కరుణాకర్,రఘు,యూత్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
శనగల రాధాకృష్ణ స్వచ్ఛంద సేవ సంస్థ సేవలు అభినందనీయం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



