శనివారం నాడు తేజ ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ ఫెస్ట్
Mbmtelugunews//కోదాడ, జనవరి 10( ప్రతినిధి మాతంగి సురేష్): తేజ కళాశాల ఆధ్వర్యంలో తేజ ఫార్మసి ఫెస్ట్ శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ప్రముఖ వైద్యులు జాస్తి సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ ఫార్మా రంగంలో భారతదేశం చాలా అభివృద్ధి చెందిందని,ఫార్మసీ విద్యార్థులు తమ సబ్జెక్ట్ లలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తేజ ఫార్మసీ కళాశాలలో చదివిన ఎందరో విద్యార్థిని విద్యార్థులు ఫార్మా కంపెనీలలో మంచి స్థాయిలో ఉన్నారని, ప్రస్తుత విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. చదువు తో పాటు విద్యార్థులు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, 35 సంవత్సరాలు పైగా ప్రైవేట్ విద్యా సంస్థలు స్థాపించి, ఎందరో విద్యార్థులకు తక్కువ ఫీజులతో, సేవా దృక్పథంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న పందిరి నాగిరెడ్డి ని అభినందించారు.ఈ కార్యక్రమంలో తేజ ఫార్మసీ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, ప్రిన్సిపాల్ పి యాదగిరి రెడ్డి, యం యస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, అధ్యాపకులు కవిత, సాహితి, సల్మా, వీరకుమారి, అంజుమ్, అమ్రీన్, నిఖత్, మణి, సిబ్బంది ప్రవీణ, అరుణ, జి నాగేశ్వర రావు, బి నాగేశ్వరరావు, 4 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



