హుజూర్ నగర్,సెప్టెంబర్ 10 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బూరుగడ్డ గ్రామంలో కీర్తిశేషులు దేశగాని గురవయ్య గౌడ్ తృతీయ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు డాక్టర్ దేశగాని సాంబశివ గౌడ్ శివగురు ఫౌండేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో వృద్ధులకు చీరలు మరియు పంచెలు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్న సేవలను గుర్తు చేస్తూ ఈ గ్రామ ముద్దుబిడ్డగా మీ బిడ్డగా ఈ ప్రాంతానికే కాదు,ఈ గ్రామానికే కాదు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి అన్ని సామాజిక వర్గాల పేదలందరికీ నా వంతు సహకారం ఎళ్ళ వేళలా అండగా ఉంటానని తెలియజేయడం జరిగింది.ప్రతి ఒక్కరూ మంచి విద్యావేత్త లుగా ఎదగాలంటే దానికి కావాల్సినది చదువు ఒక్కటే మార్గం అని ప్రతి ఒక్కరి చదువు కోసం గతంలో శివగురు ఫౌండేషన్ ద్వారా కాంపిటేటివ్ బుక్స్ ను అదేవిధంగా గ్రూప్ వన్,గ్రూప్ టూ,కానిస్టేబుల్,టీచర్,ఎస్సై తదితర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతకు ఫౌండేషన్ ద్వారా ఎంతో మందిని ఆదుకోవడం జరిగిందన్నారు.గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా శివగురు ఫౌండేషన్ పేరు మీదుగా దేశగాని గురవయ్య గౌడ్ గుర్తుగా బెంచీలను నిర్మించడం,ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూబ్ లైట్లు,ఫ్యాన్ లు బహూకరించడం కూడా జరిగింది.

రాబోయే రోజుల్లో తనవంతుగా గ్రంధాలయ ఏర్పాటుకు హామీ ఇవ్వడం జరిగింది.ఇటి కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా మహిళా కన్వీనర్ వెంపటి నాగమణి,హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొల్లగాని సుబ్బు గౌడ్,హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి,నియోజకవర్గ మహిళా కన్వీనర్ రమణ,బిట్ సెల్ నియోజకవర్గ కన్వీనర్ యరగాని వినయ్ గౌడ్,రవి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.



