మేళ్లచెరువు,మార్చి 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మేళ్లచెరువు లోని మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయనున్న జాతరలో కొందరు అధికారులు వారి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు విమర్శలు వినపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో గొప్పగా జరిగే ఈ శివరాత్రి జాతరలో ఎంతోమంది వారి జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకునే చిరు వ్యాపారులు డబ్బా కోట్ల వద్ద,రంగులరాట్నం తదితర చిరు వ్యాపారులపై విద్యుత్ శాఖ అధికారులు వారి అధికార జులుం చూపిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ అందిన కాడికి రాబట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సుదూర ప్రాంతాల నుంచి వారి బతుకు తెరువు కోసము పొట్ట చేత పట్టుకుని వ్యాపారం కోసం వచ్చే చిన్న సన్న కారు వ్యాపారులపై అధికారులు ఇలా ప్రవర్తించటం సరైనది కాదని స్థానికంగా గుప్పుమంటున్నాయి.
*శివరాత్రి జాతరలు అధికారుల చేతివాటం…?*
RELATED ARTICLES



