శ్రమదానంతో ప్రాంతీయ పశువైద్యశాల పరిశుభ్రం
స్వచ్ఛదనం -పచ్చదనం కోసం బురద తొలగించి మొరంతో వైద్యశాల ప్రాంగణం లెవలింగ్ చేసి నీరు నిలబడకుండా చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా,,పి పెంటయ్య
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 12 ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో ని ప్రాంతీయ పశువైద్యశాల లో పిచ్చిమొక్కలు పెరిగి వర్షానికి నీరు నిలిచి పశువులొస్తే బురదమయంగా మారిన ముఖద్వారం సందర్శులకు,రైతులకు,పశువులకు ఇబ్బందిగా మారడంతో స్థానికి కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు సహకారంతో జేసీబీ ద్వారా పిచ్చిమొక్కలు తొలగించి,స్వంత ఖర్చులతో కావలసిన మొరం తోలించి మొక్కలు తెప్పించి శుభ్రపరచిన నేలలో శ్రమదానంతో నీరు నిలువకుండా చేసి మొక్కలు నాటించి ప్రాంతీయ పశువైద్య శాలను ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా మార్చడం జరిగింది.ఈ కార్యక్రమములో సిబ్బంది రాజు,సాయికృష్ణ,చంద్రకళ,శివ తదితరులు పాల్గొన్నారు.



