శ్రీనగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలు…….
:నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్నదానం పుణ్యకార్యం……..
:కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…….
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 03(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నవరాత్రి గణేష్ ఉత్సవాలు భక్తులు కమిటీ సభ్యులు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అంతేకాకుండా పిల్లలకు కూడా చిన్ననాటి నుండే భక్తిశ్రద్ధలు నేర్పాలని అన్నారు. పిల్లలకు చిన్ననాటి నుండి నేర్పడం వలన వాళ్లు పక్కదారి పట్టకుండా క్రమశిక్షణతో మంచి జ్ఞానంతో పెరిగి భవిష్యత్తులో గొప్పవారు అవుతారని అన్నారు. ప్రతి సంవత్సరం కోదాడ పరిసర ప్రాంతంలో కని విరగని రీతిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న శ్రీనగర్ కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ఎర్నేని బాబు, కమిటీ సభ్యులు బత్తినేని హనుమంతరావు, భూసాని మల్లారెడ్డి, కొత్త రఘుపతి, ప్రసాద్, భూపతిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ప్రసాద్, వీరారెడ్డి, లక్ష్మయ్య, కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు…………



