కోదాడ,మార్చి 03(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.ఆదివారం అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…..ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు.శ్రీ గంగమ్మ తల్లి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన అన్నారు.ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లయ్య యాదవ్ ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పూర్ణచంద్రరావు,చిత్తలూరి సుధాకర్, రామయ్య,లక్ష్మీనారాయణ,వెంకటేశ్వర్లు,గోపి,వీరబాబు,రాము,మాజీ అధ్యక్షులు రామారావు,హనుమంతరావు,గోపి,తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గంగమ్మ తల్లి కృపతో ప్రజలందరూ బాగుండాలి:మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్.
RELATED ARTICLES



