శ్రీ చైతన్య పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 28(ప్రతినిధి మాతంగి సురేష్): సివి రామన్ పరిశోధన ఫలితాన్ని పురస్కరించుకొని నేషనల్ సైన్స్ డే గా శనివారం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథులుగా ఈజీఎమ్ మురళీకృష్ణ, ఆర్ఐ దండా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈజిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ జ్ఞానంతో అభివృద్ధి చెందుతూ మంచి విజయాలు సాధించాలని కోరారు.

విద్యార్థులు సివి రామన్,అబ్దుల్ కలాం లాంటి మేధావులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. నేడు ప్రపంచంలో మొత్తం సైన్స్ మీదనే ఆధారపడి నడుస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వెంకట్, ప్రిన్సిపాల్ గోపాలస్వామి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



