శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్ నాట్య విద్యార్థుల భరతనాట్యం అరంగేట్రమ్
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 14 (ప్రతినిది మాతంగి సురేష్): శ్రీ తన్వీ నటరాజ్ డ్యాన్స్ స్కూల్ నిర్వాహకులు నాట్య గురువు తిరుపతి స్వామి గారి శిష్య బృందం 11 మంది నాట్య విద్యార్థులు అయ్యప్ప స్వామి దేవాలయం లో భరతనాట్యం అరంగేట్రం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో నాట్య విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి భరతనాట్యం లో చిన్నారులు ప్రదర్శించిన మూషిక వాహన, పుష్పాంజలి, అలరింపు, జతిస్వరం, తిల్లాన, కల్యాణ రామ సీత స్వయంవరం, శ్రీకర శుభకర లక్ష్మి నరసింహ, భావములో బాహ్యమందు గోవిందా, అయిగిరి నందిని, అదివో అల్లదివో, నాట్య గణపతి, శివతాండవం ప్రేక్షకుల మనస్సును ఎంతగానో ఆకట్టుకున్నాయి. అరంగేట్రం చేసిన చిన్నారులు, తన్వీ, శ్రీ తీర్థ, ప్రణయ, రక్షిత, అన్షి, దార్శిక, ఉద్విత, మేఘన, హర్షిత, వాణి, శాన్వి, వీరితో పాటు సీనియర్ నాట్య విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమం లో తల్లి తండ్రులు, భక్తులు, ప్రేక్షకులు వారి ఆనందాన్ని తెలియజేశారు.



