శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పంట కౌలు వేలం పాట
కోదాడ,జూన్ 21(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మున్సిపల్ పరిధిలోని బండపాలెం శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పంట భూములను 2024-25 సంవత్సరం గాను కౌలు వేలంపాటను శుక్రవారం మిర్యాలగూడ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఈశం రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా దేవాలయానికి సంబంధించిన 26 ఎకరాల భూమి కౌలు వేలం నిర్వహించారు.ఈ వేలం పాట లో రైతులు సామినేని వెంకటేశ్వర్లు 2 లక్షల31 వేల రూపాయలకు,షేక్ నాగుల్ మీరా 61 వేల రూపాయలకు,షేక్ నాగుల్ మీరా లక్ష ఇరవై వేల రూపాయలకు,సామినేని సతీష్ 13000 రూపాయలకు,దంతాల ఉపేందర్ ఆరు లక్షల 50 వేల రూపాయలకు మొత్తం పది లక్షల 75 వేల రూపాయలకు వేలంపాట ఆయా పంట భూములను వేలంలో దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ సామినేని నరేష్,దేవాలయ ఈవో తుమ్మల వెంకట చలపతి,దేవాలయ చైర్మన్ ముడుంబైవేణుగోపాలచార్యులు,శంబిరెడ్డి, తమ్మర బండపాలెం, బండపాలెం గ్రామలకు చెందిన రైతులు బొల్లు ప్రసాదు తుమాటి రామయ్య సజ్జ వెంకటేశ్వరరావు సామినేని వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయి) వేలం పాట లో పాల్గొన్నారు.



