Saturday, July 5, 2025
[t4b-ticker]

శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు

శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర దేవాలయంలో బ్రహ్మోత్సవాలు

Mbmtelugunews//కోదాడ,మార్చి 10(ప్రతినిధి మాతంగి సురేష్):జై శ్రీమన్నారాయణ,మన తెలంగాణా రాష్ట్రంలోని
సూర్యాపేట జిల్లా,కోదాడుమండలమునకు సమీపములో బండపాలెము గ్రామము నందు వేంచేసి యున్న శ్రీ దేవల్ బాలాజీ వేంకటేశ్వర దేవాలయంలో ఈనెల అనగా మార్చి 11వతేదీ నుండి16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
ప్రారంభము కానున్నవి.
ముఖ్యమైన కార్యక్రమాలు.
11/3/2025న విష్వక్సేన ఆరాధన,ధ్వజారోహణము మొదలగునవి.12న ఉదయం10గంటలకు సంతానార్థము ఇచ్చే”గరుడ ప్రసాదము”కార్యక్రమమును భక్తులు సద్వినియోగ పరచుకోగలరు.ది.14/3/2025 శుక్రవారము నాడు రాత్రి 8గంటలకు”ఎదుర్కోళ్ళు”,9గంటలకు శ్రీవారి వార్షిక””కల్యాణోత్సవం “గలదు.15/3/2025న సాయంకాలం 7గంటలకు గరుడ సేవ ఉండును.16/3/2025న మధ్యాహ్నం మహా పూర్ణాహుతి,చక్రతీర్థం,సాయంకాలం ధ్వజావరోహణం,శ్రీ పుష్పయాగం,సప్తావరణం,పవళింపు సేవతో ఉత్సవ పరిసమాప్తి మున్నగు కార్యక్రమాలు జరుగును.భక్తమహాశయులెల్లరు.పెరుమాండ్లను సేవించి తరించగలరనీ.అర్చకులు,
ముడుంబై రామలక్ష్మణ ఆచార్యులు తెలుపారు. పూర్తి వివరాలకు ఈ నెంబర్ 9848582299 ను సంప్రదించగలరు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular