శ్రీ బాలఉగ్ర నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్,మే 18(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండల పరిధిలోని యర్రవరం గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి కళ్యాణ జయంతోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కమిటీ సభ్యులు హైదరాబాదులోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదగా చేయించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మా ప్రాంతంలో శ్రీ బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి స్వయంబుగా వెలిసి ఎంతో మంది భక్తుల కోరికలు చేర్చడం మా ప్రాంతానికి గర్వకారణం అని అన్నారు.దేశంలోనే కోదాడ ప్రాంతానికి ఈ టెంపుల్ ద్వారా మంచి పేరు వచ్చిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.అనంతరం ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు భాషబోయిన భాస్కర్ మాట్లాడుతూ ఈనెల 21,22,23 తేదీలలో శ్రీ ధూళ్ళగుట్ట మహాక్షేత్ర వాల్మీకోద్భవ స్వయంయుక్త శ్రీ బాల ఉగ్ర లక్మి నరసింహ స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవము నృసింహ ఉత్సవములు జరుగుతాయని కావున ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా నీటిపారుదల@పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డిలు పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కో కమిటీ,ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



