షాట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
Mbmtelugunews//కోదాడ, మార్చి 25:మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇంటి యజమాని కొండా వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం మేము రోజువారి లాగానే పనులకు వెళ్ళాము ఆ సమయంలో ఇంటిలో షార్ట్ సర్క్యూట్ వలన అలుముకున్న మంటలకు ఇంట్లో సామాగ్రి మొత్తం కాలిపోయినాయి.

ఈ సామాగ్రి లక్ష రూపాయల వరకు ఉంటుందని తెలిపారు.ఇంట్లో ఎవరూ లేకపోవడం తో ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లోని సామాగ్రి విలువైన వస్తువులు పూర్తిగా దగ్దం.మంటలను ఆర్పిన స్థానికులు.



