:జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు లో ప్రమాదం..
కోదాడ,మార్చ్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జూనియర్ సివిల్ జడ్జ్ మరియు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు రికార్డు గది నందు భద్రపరిచి ఉన్న బీరువాలోని పలు రికార్డులు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో దగ్ధమయ్యాయి. విద్యుత్ బోర్డ్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ తో అదే బోర్డుకు వెనకాల రికార్డులు భద్రపరిచిన బీరువాకు మంటలు అంటుకొని లోపల ఉన్న రికార్డులు దగ్ధమయ్యాయి.పట్టణ సీఐ రాము,ఎలక్ట్రికల్ ఏఈ మల్లెల శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.



