షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి కుటుంబం
Mbmtelugunews//కోదాడ,మార్చి 06(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం లో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామానికి చెందిన కనగాల కోటయ్య రామ తులసమ్మ కుమారుడు పుల్లారావు రజిని కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని రూరల్ ఎస్సై ప్రారంభించారు.అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు రూరల్ ఎస్సైను శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నల్లపాటి నరసింహారావు,ఆలయ పూజారి సాయి శర్మ,ముండ్రా రంగారావు,అలసకాని శరభయ్య,ముండ్రా రత్నకుమార్,రామారావు,రమేష్,ముండ్రా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.