షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Mbmtelugunews//హైదరాబాద్,ఆగష్టు 24:మాస్ మాహారాజా రవితేజ షూటింగ్ లో గాయపడ్డారని తెలుస్తోంది.ఇటీవలే మిస్టర్ బచ్చన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ఆర్టీ 75 మూవీ చేస్తున్నారు.ఈ షూటింగ్ లో రవితేజ గాయపడ్డట్టు తెలుస్తోంది.ఆర్టీ75వ షూటింగ్లో రవితేజ కుడిచేతికి గాయం అయిందని తెలుస్తోంది.గాయాన్ని కూడా లెక్క చేయకుండా రవితేజ షూటింగ్ను కంటిన్యూ చేశారట.గాయంతోనే షూటింగ్లో రవితేజ పాల్గొన్నారు.కుడిచేతి గాయం ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రిలో రవితేజకు శస్త్రచికిత్స తీసుకున్నారు.ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యుల సూచించారని తెలుస్తోంది.యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోన్న సమయంలో షూటింగ్ లో రవితేజకు గాయం అయ్యిందని తెలుస్తోంది.ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రవితేజ త్వరగా కోలుకోవాలంటూ..అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.