సంతోష్ ఫైర్ వర్క్స్ దీపావళి మందుల షాపును ప్రారంభించిన చైర్పర్సన్
Mbmtelugunews//కోదాడ, మార్చి 20(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడలోని హుజూర్ నగర్ రోడ్డులో సంతోష్ ఫైర్ వర్క్స్ దీపావళి మందుల షాపును ప్రారంభోత్సవం చేస్తున్న కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు. అనంతరం వారు మాట్లాడుతూ కోదాడ దిన దినం అభివృద్ధి చెందుతుంది అనటానికి కొత్త కొత్త షాపులు ఏర్పాటు చేయడమే నిదర్శనమని అన్నారు. కోదాడ పరిశుద్ధ ప్రాంత ప్రజలకు నాణ్యమైన దీపావళి మందులు అందించాలని అన్నారు. అంత పెద్ద షాప్ ఏర్పాటు చేసిన షాపు యజమాని సంతోష్ ను అభినందించారు. అనంతరం షాప్ యజమాని సంతోష్ ముఖ్య అతిథులను శాలువా బొకే తో ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో 21వ కౌన్సిలర్ కట్టబోయిన జ్యోతి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కాజా మోహినిద్దీన్, పాశం శ్రీనివాస్, కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



