Monday, July 7, 2025
[t4b-ticker]

సంత సమస్యలతో చింత?

సంత సమస్యలతో చింత?

:అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సమస్యలతో సతమతమవుతున్న అతిపెద్ద సంత ఏదో వింత?

:సంతలో పారిశుద్ధ్యని మరిచిన అధికారులు

:పనిచేయని యూరినర్స్ ఇబ్బంది పడుతున్న రైతులు

:శుభ్రంగా లేని మరుగుదొడ్లు

:అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

:రైతులకేసిన షెడ్లను కొంతమంది సొంత పనులకు వాడుతున్నారు

:నిత్యం సంతలో ప్రైవేటు వ్యక్తుల పశువులు,గడ్డి వాముల కార్యకలాపాలు

:రోడ్ల వెంబడి షాపులకు టెండర్లు ఎప్పుడు?

:పట్టించుకోని సంబంధిత అధికారులు భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే సమాచారం

కోదాడ,జులై 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ సంత ఉమ్మడి ఏపీ లోనే అతిపెద్ద సంతగా ఉన్న ఈ సంతలో హుజూర్ నగర్,ఏపీలోని జగ్గయ్యపేట ఇంకా ఇతర ప్రాంతాలు ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి,కూసుమంచి అనేక ప్రాంతాల రైతులు ఈ సంతకు వస్తుంటారు.ఈ సంత శనివారం,ఆదివారాలలో బాగా కార్యకలాపాలు జరుగుతాయి.ఇలాంటి సంతకు ఆ రెండు రోజులు వేలమంది రైతులు వారి గేదెలను,ఆవులను,మేకలను,గొర్రెలను తోలుకొని రైతులు మగ,ఆడ అనే తేడా లేకుండా వస్తుంటారు.సంత రెండవ గేటు ఈ మధ్యకాలంలో తాళాలు వేశారు.ఈ రెండవ గేటు వద్ద ఎక్కువగా రైతుల కార్యకలాపాలు జరుగుతుంటాయి.అలాంటి ప్రాంతంలో సంతలో నుండి వచ్చిన మురుగునీరు అంతా అక్కడ ఆగి దుర్గంధ వాసనతో పాటు విపరీతమైన దోమల చేరి వచ్చిన రైతులకు ఆ దోమల కుట్టి డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారు.అసలే సీజనల్ వ్యాధులతో ప్రజలు నానా ఇబ్బందులు పడి ప్రైవేట్ హాస్పటల్ లో చూయించుకోవడానికి డబ్బులు లేక వారి పశువులను సంతలో అమ్మి చూయించుకోవచ్చని వస్తే ఇక్కడ దోమలు కుట్టి మళ్లీ రోగాల బారిన పడుతున్నామని రైతులు వాపోతున్నారు.ఇలా సంత మొత్తం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.ఈ సంతకు ఎంతోమంది మేధావులు మార్కెట్ కమిటీ చైర్మన్ లు గా పనిచేశారే తప్ప సంతను అభివృద్ధి చేయడంలో పూర్తిగా శూన్యం.రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.రోడ్ల వెంబటి ఉన్న షాపులకు టెండర్ల నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారు.అలా చేయడం వలన అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు ముడతన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు తగు సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు వాపోతున్నారు.

*:సంతలో పారిశుద్ధ్యని మరిచిన సంబంధిత అధికారులు*

సంతలో పారిశుద్ధ్యం పనులు నిర్వహించడానికి టెండర్ల ద్వారా కాంట్రాక్టర్ కి వొప్పచెపుతారు మరి కోదాడ సంతలో ఏమైందో కానీ టెండర్ పిలిచారు పిలవలేదు తెలియదు కానీ సంతలో ఎక్కడ పారిశుద్ధ్యం అక్కడే ఉండిపోయింది.సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

*:పనిచేయని యూరినర్స్*

సంతలో లక్షలు ఖర్చుపెట్టి రెండు ప్రాంతాలలో యూరినర్స్ నిర్మాణం చేపట్టినారు కానీ అవి పని చేయడం లేదు రైతులు వారి గేదెలను విడిచిపెట్టి బయటకు వెళ్లి యూరిన్ పోసే పరిస్థితి లేదు కావున రైతులు వారు బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేస్తున్న అధికారులు అంతే చూస్తున్నారు.

*:శుభ్రంగా లేని మరుగుదొడ్లు*

సంతలో మరుగుదొడ్లను నిర్మించారు వాటిని శుభ్రంగా ఉంచడంలో పూర్తిగా విఫలం చెందినారు.సంతకు ఆడవారు కూడా వస్తుంటారు వారు మరుగుదొడ్లు వాడాలంటే భయంతో వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే మగవారు వాడే  మరుగుదొడ్లను ఆడవాళ్లు వాడాల్సి వస్తుంది కనీసం స్త్రీ,పురుషులు అనే సిగ్నల్స్ కూడా మరుగుదొడ్లకు వేయకపోవడం చాలా బాధాకరమని రైతులు వాపోతున్నారు.

*:అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ*

రెండో గేటు వద్దకు సంతలో మురుగు నీరు అంతా అక్కడికి చేరడం వలన వచ్చే రైతులకు దుర్గంధ వాసనతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉన్నది ఆ నీరు బయటకి పంపించడంలో అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు వాపోతున్నారు.

*:రైతులకు ఏర్పాటుచేసిన షెడ్స్ సొంత అవసరాలకు వాడుకుంటున్నారు*

వర్షాకాలం సమయంలో రైతుల పశువులు తడవకుండా షెడ్స్ ఏర్పాటు చేసినారు అలాంటి షెడ్ లలో కొంతమంది వారి సొంత పశువులను కట్టేసి,గడ్డివాములు వేసి నిత్యం వారి సొంత కార్యకలాపాలకు వాడుకుంటున్నారు.గతంలో సంతలో గడ్డికి సంబంధించి టెండర్లు నిర్వహించారు కానీ ఇప్పుడు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా అధిక రేట్లకి గడ్డిని కొందరు రైతులకు అమ్ముకుంటున్నారు.వారి వద్ద నుండి అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

*:మార్కెట్ కమిటీ కార్యదర్శి అశోక్ ని చరవాణి ద్వారా వివరణ అడగగా*

షాపులకి టెండర్లు నిర్వహించకుండా ఉన్న రెంట్ కి 20% ఎక్కువ వాళ్ళ వద్ద నుంచి తీసుకుంటున్నామని,యూరినర్స్ ని మేమే నిలిపివేసాము సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వాడటంలేదని,మరుగుదొడ్లు కి స్త్రీ, పురుషుల మార్కింగ్ లేదనగా పరిశీలిస్తామన్నారు.డ్రైనేజీ బ్లాక్ అయిందని సంబంధిత మున్సిపల్ కమిషనర్ కి తెలియపరిచామని అన్నారు.పారిశుద్ధ్యన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నామని అన్నారు.కొందరు సొంత కార్యకలాపాలకు సంతను వాడుకుంటున్నారు అనగా పరిశీలిస్తామన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular