సూర్యాపేట జిల్లా (mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) తుంగతుర్తి
తిరుమలగిరి పిఎస్ జమిందార్ డేగవత్ రమేష్ రాథోడ్ మాతృమూర్తి డేగవత్ సత్తెమ్మ అకాల మరణం పట్ల డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ సంతాపం తెలిపారు.సత్తెమ్మ మృతవార్త తెలుసుకున్న ఆయన బుధవారం మండల కేంద్రంలోని ఆమె నివాసానికి వెళ్లి సత్తెమ్మ భౌతిక ఖాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె కుమారులైన రమేష్ రాథోడ్,రవి రాథోడ్ లతో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఆమె మృతి పట్ల వెంకన్న యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగఢ అనురాధ,పార్టీ సీనియర్ నాయకులు గుడిపాటి నర్సయ్య, డా.లలితా సిస్టర్,అరుణ్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు,ఉద్యోగులు, బందువులు సంతాపం ప్రకటించారు.
సత్తెమ్మ మృతి పట్ల డీసీసీ అధ్యక్షులు చెవిటి సంతాపం….
RELATED ARTICLES