సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్…
:పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్….
:మానవకోటికి ఇది మార్గదర్శకం……
:అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే ఆనంద వేడుక రంజాన్….
:ముస్లిం సమాజానికి ఈద్ ముబారక్…. మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు…….
Mbmtelugunews//కోదాడ, మార్చి 21(ప్రతినిధి మాతంగి సురేష్): సత్యం, ధర్మం, పవిత్ర ఆలోచనల సమాహారమే రంజాన్ అని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణం లోని సాలార్జంగ్ పేట ఈద్గా లో రంజాన్ పర్వ దినం ప్రార్థనల అనంతరం మున్సిపల్ వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లతో కలిసి ముస్లింలకు ఈద్ ముబారక్ తెలిపి మాట్లాడారు.

పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరించిన నెల రంజాన్ అని మానవకోటికి ఇది మార్గదర్శకం అన్నారు.అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలిపే ఆనంద వేడుక రంజాన్ అన్నారు. ముస్లింల సంక్షేమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి ల సహకారం తో కృషి చేస్తామన్నారు. ఈద్గా, షాది ఖానా లకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లు నిధులు మంజూరు చేశారన్నారు.ముస్లిం సమాజానికి ఈద్ ముబారక్ తెలిపారు. కాగా పాలక వర్గం పక్షాన ముస్లిం ఈద్గా ప్రార్థనలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపట్ల ముస్లిం లు ఆనంద ఉత్సవాలు వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చీమ నరేష్ బాబు, వైస్ ఛైర్మన్ మల్లీశ్వరి, కమిషనర్ రమాదేవి, మైనార్టీ నాయకులు అల్తాఫ్ హుస్సేన్, బాగ్దాద్, బాజాన్, అజీమ్, మాదార్ సాహెబ్, ఫయాజ్, కౌన్సిలర్ లు,పాల్గొన్నారు.



