కోదాడ,జులై 16(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ అంజి యాదవ్ చేపట్టిన మన ఊరుకు,మన వాడకు,మన గడపకు పాదయాత్ర మూడవ రోజు అనంతగిరి,అమీనాబాద్, రంగయ్య గూడెం గ్రామాల మీదగా విజయవంతంగా సాగింది.అంజి యాదవ్ తన పాదయాత్రలో మహిళలు,యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతుందని మీలాంటి నాయకులు ఎమ్మెల్యే గా రావాలని యువత స్వాగతం పలికారు.పెరిగిన ధరలతో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై గ్రామాల ప్రజలను,వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను యువనేత తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అంజి యాదవ్ మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదాలతో యువనేతగా,బిసి బిడ్డగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీలో ఉంటానని ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజల సమస్యల భాద్యతగా పని చేస్తానని హామీ ఇచ్చారు. మూడు రోజులుగా సాగుతున్న పాదయాత్రలో గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు గుర్తించామన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి,స్థానిక ఎమ్మెల్యేకు అధికారం,పదవులపై ఉన్న వ్యామోహం ప్రజా సమస్యలపై లేకపోవడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.