సమాజంలో అత్యంత పవిత్రమైనది వైద్య వృత్తి: మండల వైద్యాధికారి
Mbmtelugunews//సూర్యాపేట, జులై 01(ప్రతినిధి మాతంగి సురేష్: సమాజం లో అత్యంత పవిత్రమైన, వృత్తి వైద్య వృత్తి అని ఆత్మకూర్ ఎస్ మండల వైద్యాధికారి మౌనిక అన్నారు.జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పుర స్కరించుకొని మంగళవారం ఆత్మకూర్ (ఎస్ )మండల కేంద్రంలోని పీహెచ్సీ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కందగట్ల ప్రభుత్వ హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్ బంకా వీరేందర్ నాధ్ ను శాలువా పూల బొక్ తో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డాక్టర్లు సమాజానికి ఎంతో విలువైన సేవలు అందిస్తారని, మానవతా దృక్పథంతో చేసే పవిత్రమైన వృత్తి లో డాక్టర్లు ఉండడం వారి అదృష్ట మని తెలిపారు. మండలంలోని ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు మంచి సేవలు అందిస్తున్నారని కితాబునిచ్చారు.
ఈ సేవలను ఇలాగే కొనసాగించడ మే కాకుండా, మానవత్వాన్ని స్పృ శించే విధంగా సేవలందించాలని కోరారు. భవిష్యత్తులో జిల్లా ప్రజల కు ఇంకా మంచి వైద్య సేవలు అం దించి అందరి మన్ననలను పొందా ల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ యాదగిరి, సూపర్వైజర్ మాణిక్యమ్మ, హెల్త్ అసిస్టెంట్ కొండ శ్రీను, రాజేంద్రప్రసాద్, పిహెచ్సి సిబ్బంది, డాక్టర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.