కోదాడ,జులై 16(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:సమాజ సేవ,విద్యాభివృద్దే లక్ష్యంగా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సేవలందిస్తుందని అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి రమేష్ స్పష్టం చేశారు.ఆదివారం స్థానిక గుడుగుంట్ల అప్పయ్య-సుబ్బమ్మ ఫంక్షన్ హాల్ నందు అసోసియేషన్ 18 వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇరుకుల్ల చెన్నకేశవరావు తో కలిసి పాల్గొని..మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య పేద విద్యార్థిని విద్యార్థులకు అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని అందుకు తమ సహకారం అన్ని విధాలుగా ఉంటుందని తెలిపారు.రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇరుకులకు చెన్నకేశవరావు,జోనల్ చైర్మన్ సముద్రాల అశోక్ మాట్లాడుతూ సమాజ సేవలో అసోసియేషన్ ముందుందని,మరిన్ని కార్యక్రమాలను రూపొందించి సమాజ సేవే లక్ష్యంగా ముందుకు కొనసాగుతామని తెలిపారు.అసోసియేషన్ 18 వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా 28 మంది పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న చిన్నారులకు,ఆటల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందిబండ వెంకటేశ్వరరావు,గౌరవఆధ్యక్షులు గోళ్ళ చంద్రయ్య,ప్రధాన కార్యదర్శి చారుగుండ్ల రాజశేఖర్,కోశాధికారి ఓరుగంటి శ్రీనివాసరావు,కాంతారావు,చక్కా కృష్ణ ప్రసాద్,రంగారావు,లోకేష్,వంగవేటి శ్రీనివాసరావు,గరినే శ్రీధర్,అనంత చక్రవర్తి,డాక్టర్ భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
సమాజ సేవ,విద్యాభివృద్దే లక్ష్యంగా ఆ.వో.ప.:28 మంది పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఆర్థిక సహాయం.:ఘనంగా ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ 18 వార్షికోత్సవ వేడుకలు
RELATED ARTICLES