కోదాడ,ఏప్రిల్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్: పట్టణంలోని సంత ఎదురుగా సద్దాయి సర్వాయి పాపన్న 134వ వర్ధంతి వేడుకలు స్థానిక గౌడ సంఘ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలో మెుఘల్ రాజు,అప్పటి పాలకుల,అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని, తాబేదారులు,జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా పాపన్న ప్రస్థానం ప్రారంభించాడన్నాడు.తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని,సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడన్నారు.పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు అని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి,జయంతి వేడుకలు గౌడ సంఘాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కొండా సైదయ్య గౌడ్,మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్,మరికంటి లక్ష్మణ్ గౌడ్,సంపేట ఉపేందర్ గౌడ్,ఉయ్యాల నర్సయ్య,మొలుగురు నాగరాజు,మేకపోతుల సత్యనారాయణ గౌడ్,పుట్ట వెంకటేశ్వర్లు గౌడ్,బండి శ్రీనివాస్ గౌడ్,కేశగాని రమేష్,సంపేట నరేష్ గౌడ్,మండవ నరసింహారావు,ఉపేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఛత్రపతి శివాజీకి సమకాలికుడు:కారింగుల అంజన్న గౌడ్
RELATED ARTICLES



