కోదాడ,డిసెంబర్ 29(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:వేదమంత్రాల నడుమ సర్వ మత ప్రార్థనలతో భారీ జన సంద్రోహం నడుమ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభించిన స్థానిక శాసన సభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఇంత మెజారిటీ ఎవ్వరికీ రాలేదు కానీ నా మీద నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన కోదాడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు ప్రజలకు కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉంటానని కోదాడ నియోజకవర్గ ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ వారితో మమేకమై ప్రజాపాలన నిర్వహిస్తానని అన్నారు.

డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు గ్రామాలలో జరుగు ప్రజా పాలనలో ప్రభుత్వం అందించిన దరఖాస్తులను నింపి అధికారులకు ఇచ్చి ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ఎంపీపీలు,జడ్పీటీసీలు,సర్పంచులు,ఎంపీటీసీలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



