సూర్యాపేట,ఆగష్టు 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సాగర్ ఎడమ కాలువ ద్వారానీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.హుజూర్ నగర్,కోదాడ నియోజకవర్గ లలో వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తుందని,సాగర్ ఆయకట్టు పరిధిలో బోరు బావుల కింద నాట్లు పూర్తయి రోజులు గడుస్తున్న వరి పంట పొలాలకు సాగుకు నీటిని విడుదల చేయకపోవడం తోపంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని,దీంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో కుట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు.గతంలో 480 అడుగులు నీరు ఉన్నప్పుడు సాగునీటిని విడుదల చేశారని,ప్రస్తుతం 518 అడుగులునీరు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం సాగుకు నీటిని విడుదల చేయడం లో నిర్లక్ష్యం తగదన్నారు. తక్షణమే సాగు నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలి.:నీళ్లు లేక ఎండిపోతున్న వరి పొలాలు.:ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్
RELATED ARTICLES



