సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
కోదాడ,జూన్ 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవం సంధర్బంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాస్పిటల్ సూపరింటండెంట్ డాక్టర్ దశరథ పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయినదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.హాస్పటల్ యొక్క అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు మమత,ఝాన్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



