సామినేని వెంకటేశ్వరరావు మృతి ఆ కుటుంబానికి తీరని లోటు:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ,జులై 08(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్ సామినేని వెంకటేశ్వరరావు మృతి చెందడం ఆ కుటుంబానికి,కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు అని స్థానిక శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం తమ్మర బండపాలెం గ్రామానికి చెందిన సామినేని వెంకటేశ్వరరావు చనిపోయిన విషయము తెలుసుకొని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదివారం రాత్రి 10-30 గంటలకు తమ్మరలోని వారి నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపుతూ చనిపోయిన సామినేని వెంకటేశ్వరరావు ఆత్మకి శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియ చేసినారు.ఈ కార్యక్రమంలో వారి వెంట తుమాటి నాగిరెడ్డి,సుందరి వెంకటేశ్వర్లు,కోసూరి నరేష్,ఎస్.కె షరీఫ్,చట్టు కరన్,ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా డైరెక్టర్ షేక్ జానీ,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ సోందుమియా,షేక్ కాసులు,షేక్ సమీర్,నిడికొండ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.