సామూహిక సత్యనారాయణ వ్రతం.
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడలో బ్రహ్మా కుమారిస్ వారి ఆధ్వర్యంలో బెంగుళూరు పట్టణానికి చెందిన రాజయోగి బి కే మంజునాథ్ సమక్షంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు 108 పుణ్య దంపతులతోకనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించారు.ఆధ్యాత్మిక రహస్యాలతో శ్రీ సత్యనారాయణ స్వామి అసలు వృత్తాంతం దాని అంతరార్థం,ప్రతి మానవుడు ఆ కథలోని నీతిని తెలుసుకొని శ్రీ సత్యనారాయణ స్వామి రీతిగా ఉన్నప్పుడే ఈవిశ్వం స్వర్గమయమౌతుందని చక్కగా వివరణతో అర్థమయ్యేటట్లుగారాజయోగి బీకీ మంజునాథ్
వివరించారు.ఏ భక్తులైతే ఈ వ్రతాన్ని ఆచరించారో వారు ధన్యులైనారు.ఆద్యంతం చాలా క్రమశిక్షణ,ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని అనుభూతి చెందుతారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం ఆ శివ పరమాత్మ ద్వారా తెలుసుకొని ఎవరికి వారే వారి జీవితాలని సుఖశాంతులమయంగా చేసుకోవచ్చని చక్కగా వివరణతో వ్రతాన్ని చేయించారు.బ్రహ్మకుమారీల యోగశక్తితో పూజా కార్యక్రమం దిగ్విజవంతం అయినది.ప్రతీ ఒక్కరూ రోజు తమ కోసం ఒక గంట సమయం కేటాయించి రాజ యోగ మెడిటేషన్ చేసుకుని సుఖ శాంతులతో జీవించాలని వారు కోరారు.