సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదానం
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 28(ప్రతినిది మాతంగి సురేష్): మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామంలో రామాపురం క్రాస్ రోడ్డులో ఉన్న షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు మాట్లాడుతూ ఈ మందిరంలో బాబా ఎంతో పవిత్రమైన దేవుడని ఈ టెంపుల్ ని సందర్శించడానికి రెండు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. అంతేకాకుండా వారు కోరికలు నెరవేరిన వారు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు సాయి శర్మ, గురవయ్య, సత్యనారాయణ, రాంబాబు, భక్తులు పాల్గొన్నారు.



