సాయి మందిరంలో ఘనంగా గెల్ల ఇవాన్ కృష్ణ జన్మదిన వేడుకలు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 04( ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరధిలోని నల్లబండ గూడెం గ్రామంలోని సాయి మందిరంలో ఘనంగా గెల్ల ఇవాన్ కృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి మందిరంలో దేవాలయ చైర్మన్ నలపాటి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు .అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . నల్లబండగూడెం గ్రామానికి చెందిన గండ్ర సీతారాం రెడ్డి రాజేశ్వరి దంపతులు, వారి కుమారులు వినోద్ కుమార్ ఆకాంక్ష, కృష్ణ చైతన్య దివ్య కుటుంబ సభ్యులు గెల్లా ఇవాన్ కృష్ణ జన్మదిన వేడుకల సందర్భంగా అయ్యప్ప స్వాములకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరపు లక్ష్మణరావు, రవి, శరభయ్య ఆదినారాయణ, రంగారావు, సాయి శర్మ, పూర్ణబంధుమిత్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.



