సాయి మందిరంలో ప్రత్యేక పూజలు,అన్నదానం
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 13 (ప్రతినిధి మాతంగి సురేష్)మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామ పరిధిలో రామాపురం క్రాస్ రోడ్ వద్ద సాయి మందిరంలో హాయిత్ వెంకప్ప నాయుడు అనూష దంపతుల కుమారుడు కుషాల్ చౌదరి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని కుశాల్ చౌదరి తల్లిదండ్రులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అక్క జాన్వీ చౌదరి,కంచర్ల లక్ష్మి,మహేందర్,దేవాలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నరసింహారావు,అర్చకులు సాయి శర్మ,రమాదేవి భక్తులు పాల్గొన్నారు.