సిపిఎం నాయకుని మృతి పట్ల సంతాపం…
చిలుకూరు,జూన్ 24(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు మండల కేంద్రానికి చెందిన ఎలుగూరి గోవర్ధన్ సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు.ఆయన మృతదేహం వద్ద సిపిఎం నాయకులు పూలమాలవేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గోవర్ధన్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు.సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సీనియర్ నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు,జిల్లా,మండల నాయకులు మేదరమట్ల వెంకటేశ్వరరావు,చందా చంద్రయ్య, నాగాటి చిన రాములు,రాపోలు సూర్యనారాయణ,కొండారెడ్డి,విజయలక్ష్మి,స్టాలిన్ రెడ్డి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.



