కోదాడ,ఆగష్టు 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా సిపీఎస్ పీఠముడి విడదీసి,పాత పెన్షన్ అమలు చేయాలని,టీఎస్ సిపిఎస్ ఇయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు మంగళవారం నాడు ఎఫ్ఎల్ఎన్ ఆంగ్లం శిక్షణా కేంద్రం సి సి ఆర్ స్కూల్ కోదాడలో మాట్లాడుతు పాత పెన్షన్ సాధన కోసం”ఆగస్టు 12 చలో హైదరాబాద్ “కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యూనియన్ సారధ్యంలో నిర్వహించనున్నట్లు,అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ధనిక తెలంగాణ రాష్ట్రంలో రానున్న సాధారణ ఎన్నికలకు ముందే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి,సిపిఎస్ పీఠముడి సమస్యను పరిష్కరించి,పాత పెన్షన్ విధానాన్ని అమలు ప్రకటనతో 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ కుటుంబాలకు మేలు కలిగే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకావాలన్నారు.దక్షిణ భారతదేశంలో సిపిఎస్ ను రద్దు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణను ఆదర్శంగా నిలపాలని కోరారు.ఈ సంధర్భంగా శిక్షణ విరామ సమయంలో సిపిఎస్ రద్దు కోరుతూ పోస్టర్లు,కరపత్రాలు తో ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో శిక్షణ కేంద్రం కోర్స్ డైరెక్టర్ వి. రామారావు,ఇన్చార్జులు ఉపేందర్ రావు,సిపిఎస్ కోదాడ అనంతగిరి మండలాల బాధ్యులు బాలరాజు,ఆంజనేయులు,కృష్ణ, నరేష్,నరేందర్ రెడ్డి,సత్యవతి,రమాదేవి,షబానా,ధనలక్ష్మి,సమత,మాధవి,అన్నపూర్ణ,శ్రావణి,జ్యోతి శిక్షణ రిసోర్స్ పర్సన్స్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సిపిఎస్ పీఠముడి విప్పండి..పాత పెన్షన్ అమలు చేయండి:బడుగుల సైదులు.
RELATED ARTICLES



