సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి-
Mbmtelugunews//చిలుకూరు,నవంబర్ 11 (ప్రతినిధి మాతంగి సురేష్)భారత కమ్యూనిష్టు పార్టీ 100 సం, 2024 డిసెంబర్ 26 నాటికి 100 సం|| అడుగిడుతున్న సందర్భంగా ఎంతో ఘనమైన చరిత్ర కలిగి స్వాతంత్ర్య ఉధ్యమంలో ఎన్నో నిర్బాంధాలను ఎదుర్కొని స్వతంత్ర ఉద్యమంలో ప్రజా సంఘాలను నిర్మాణం చేసుకొని ప్రాణత్యాగాలు చేసిన పార్టీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులను కోరారు. సోమవారం చిలుకూరు మండల కేంద్రంలో చిలుకూరు మండల కౌన్సిల్ సమావేశం డిఎన్ భవన్ లో చేపురి కొండలు అధ్యక్షతన నిర్వహించగ ముఖ్య అతిదిగ పాల్గొని మాట్లాడుతు.చిలుకూరు మండలంలో పార్టీ 1050 సభ్యత్వం కలిగివునిది ఈ మండలం నుండి 3 వేల మంది డిసెంబర్ 30న నల్లగొండలో జరిగే సభకు సమీకరణ చేయనున్నాట్లు ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కార్యాదర్శి మండవ వెంకటేశ్వర్లు,షేక్ సాయిబల్లి,కే వెంకటయ్య,దొడ్డ వెంకటయ్య,రెమిడాల రాజు,తాళ్కూరి రామరావు,దొడ్డ నాగేశ్వరావు.కస్తూరి సత్యం,అలివేలు,జయసుధ తదితరులు పాల్గొన్నారు.