ఖమ్మం జిల్లా :(mbm telugu news ప్రతినిధి శోభన్ బాబు) ప్రతినిధి కొత్తగూడెం:జులై 17
ముఖ్యమంత్రి కేసీఅర్ పై భద్రాచలం ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోదావరి వరద భాదితులకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో సీఎంపై భద్రాచలం
ఎమ్మెల్యే పోదెం వీరయ్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
గత ఏడాది జూలై 17న సీఎం కేసీఅర్ భద్రాచలంలో పర్యటించారు. గోదావరి వరద గండం నుంచి గట్టెక్కించేందుకు భద్రాచలం వద్ద రూ. వెయ్యి కోట్లతో కరకట్ట నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు.
లోతట్టు కాలనీలైన సుభాస్ నగర్ ముంపు బాధితులకు మరోచోట డబుల్ బెడ్ రూం ఇళ్ళు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు.
నేటికీ ఏడాది గడిచినా సీఎం కేసీఅర్ మాట తప్పడంతో ఎమ్మెల్యే పోదెం వీరయ్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.