సీఐ శివశంకర్ కు ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ ఘన సన్మానం…
Mbmtelugunews//కోదాడ,మార్చి 18(ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ పట్టణంలో వేంచేసియున్న శ్రీరంగాపురం ఆంజనేయస్వామి దేవాలయ పాలకవర్గం కోదాడ పట్టణ నూతన సిఐ ని ఘనంగా సన్మానించారు.మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పట్టణ సీఐ శివశంకర్ ను ఆలయ పాలకవర్గ సభ్యులు పట్టు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆలయ గౌరవ అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు,ఆలయ కమిటీ చైర్మన్ కుర్రి గోపులు మాట్లాడుతూ.. పట్టణంలో శాంతియుత వాతావరణంలో ప్రజల జీవన ప్రమాణాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని,ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అభివృద్ధి పథంలో సాగాలని మనస్ఫూర్తిగా కోరారు.

ఈ సందర్భంగా పట్టణ సీఐ శివశంకర్ మాట్లాడుతూ… భగవంతుని కృపతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా పాడి పంటలతో తులతూగాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు.పట్టణంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,ప్రమాద రహిత పట్టణంగా కోదాడని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వంగవీటి శ్రీనివాస్,వెంకటరెడ్డి,గోవిందరెడ్డి,పెదనాటి నరసింహారావు,రావెళ్ల కృష్ణారావు,లైటింగ్ ప్రసాద్,వేమూరు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.