సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం..
:వెంటిలేటర్‌పై కొనసాగుతోన్న చికిత్స.
Mbmtelugunews//ఢిల్లీ,సెప్టెంబర్ 06:సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.ఈ మేరకు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందజేస్తున్నట్లుగా ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.ఇటీవలే న్యూమోనియ తో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆగస్టు 19న ఎయిమ్స్ లోని ఎమర్జెన్సీ విభాగంలో చేర్చారు.పరిస్థితి విషమించడంతో వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూ (ICU)లో చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి..