సీతా పబ్లిక్ స్కూల్ కు ఎంఈఓ షాక్
చింతలపాలెం (మల్లారెడ్డిగూడెం),జూన్ 15 (mbmteluhunews)ప్రతినిధి గోపి రెడ్డి:చింతలపాలెం మండలలో అంజనీ సిమెంట్ యజమాన్యం నిర్మించిన సీతా మెమరీయల్ స్కూల్ పై ఫేక్ సర్టిఫికెట్ తయారు చేపించి అనుమతులు పొందారంటూ లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వటం వల్ల మండల విద్యాధికారి సీతా మెమోరియల్ స్కూల్ పై విచారణ నిర్వహించడం జరిగింది.విచారణలో భాగంగా 2019లో సెక్షన్ బి అనుమతుల కోసం అసలు బ్లాక్-బి కి గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా ఫేక్ ఎన్ఓసి తయారు చేపించి అనుమతులు పొంది దర్జాగా స్కూల్ నిర్వహిస్తున్నారని పదిమంది చింతలపాలెం యువకులు లికిత పూర్వకంగా మండల విద్యాధికారికి కంప్లీట్ ఇవ్వడం దీనిపై పూర్తి విచారణ నిమిత్తం మూడు రోజుల్లో గా 2019 ఎన్ఓసీ కు బ్లాక్ -బి బిల్డింగ్ సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేనిపక్షంలో శాఖ పరమైన చర్యలు ఉంటాయని సీతా స్కూల్ యాజమాన్యానికి మండల విద్యాధికారి సైదా నాయక్ నోటీసు జారీ చేశారు.

ఫీజులు గురించి విద్యార్థులను,తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయవద్దు అన్నారు.అనంతరం మంగళవారం రోజు దీనిపై ఎంపీడీవో,డిఈఓ తో సమగ్ర విచారణ ఉంటుందని ఎటువంటి అవకతవకలు జరగకుండా విచారణ ఉంటుందని విలేకరులకు తెలియజేశారు.



