కోదాడ,మార్చి 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మార్చి 21 నుండి 24 వరకు అమిత్ నగర్ మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగే 70వ సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కోదాడ గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారుడు సంతోష ఎంపికైనట్టు గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ నామా నరసింహారావు తెలిపారు.సంతోష్ ఎంపికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కాసాని జ్ఞానేశ్వర్ కి,కె జగదీష్ యాదవ్,సూర్యాపేట జిల్లా కబడ్డీ అధ్యక్షులు రామచంద్ర గౌడ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంతోష్ జాతీయ స్థాయికి ఎంపీ కావడం సంతోషదాయకమని సూర్యాపేట జిల్లా కబడ్డీ సీనియర్ క్రీడాకారులు రవీందర్ రెడ్డి,రామసాని రమేష్,షేక్ ఇమామ్,శివ నాథ్ రెడ్డి,ఎం నాగిరెడ్డి,రమేష్ బాబు,వెంకట్ రెడ్డి,నాగరాజు క్రీడాకారుడికి అభినందనలు తెలియజేశారు.



