కోదాడ,నవంబర్ 18(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ అన్నారు.శనివారం కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యా సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఏర్పాటు చేసిన స్వాగత వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.కళాశాల నుండి అనేకమంది సీనియర్లు ఉన్నత లక్ష్యాలకు ఎదిగారన్నారు.జూనియర్ లు సీనియర్ ల నుండి సందేహలు నివృత్తి చేసుకోవాలన్నారు.జూనియర్ లకు సీనియర్ లు మనో ధైర్యాన్ని కల్పించాలన్నారు.కళాశాల యజమాన్యం విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది అన్నారు.కళాశాల అకాడమిక్ అడ్వైజర్ పొతుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ కళాశాలలో అన్ని ప్రమాణాలు ఉన్నాయని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ పి గాంధీ మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు పేరు తేవాలన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో హెచ్ఓడి లు ఎన్.రమేష్ స్రవంతి,నరేష్ రెడ్డి, జనార్దన్,ఎజాజ్ ,విద్యార్థులు పాల్గొన్నారు.
సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి.:కిట్స్ లో ఘనంగా బీటెక్ ప్రధమ సంవత్సరం విద్యార్థులకు స్వాగతం వేడుకలు.:సీనియర్ విద్యార్థులు జూనియర్లకు మార్గదర్శకంగా నిలవాలి.
RELATED ARTICLES



