సీపిఎస్,యూపిఎస్ మాకొద్దు… బేషరతుగా పాత పెన్షన్ విధానంను అమలు చేయాలి- టీజీఈజేఏసీ- సూర్యాపేట
Mbmtelugunewst//సూర్యాపేట సెప్టెంబర్ 01:ఆదివారం దేశవ్యాప్తంగా కంట్రిబ్యూటరి పెన్షన్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇటీవల యూనిఫైడ్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని లక్షలాదిగా పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన వ్యతిరేకిస్తూ 2004 సెప్టెంబర్ 1 కి ముందు అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు లో ఉంది.ఈ విధానంలో ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఉన్న చివరి వేతనం (బేసిక్ + డిఎ) లోని 50% పెన్షన్ రూపంలో ఉద్యోగికి చెల్లించే వారు. ఈ పెన్షన్ పెరిగిన డిఎ,పే రివిజన్ కి అనుగుణంగా సవరించే వారు.ఒక వేళ ఉద్యోగి మరణిస్తే ఉద్యోగి పొందుతున్న పెన్షన్ లో భాగస్వామికి (7) ఏళ్ళ పాటు లేదా భాగస్వామికి 67 ఏళ్ళు వచ్చే వరకు 50% తదుపరి 30% చెల్లించే వారు.అయితే పెరుగుతున్న సగటు ఆయుప్రమాణం,పెరుగుతున్న ఉద్యోగుల సంఖ్య,వేతనాలు దృష్ట్యా ప్రభుత్వం ఈ పెన్షన్ భారాన్ని తగ్గించుకొనుటకి కొత్త పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
నేషనల్ పెన్షన్ సిస్టం/కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (ఓపిఎస్/ ఎన్పిఎస్) సెప్టెంబర్ 01 2004 తరువాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది (తరువాత ఇది ప్రైవేట్ ఉద్యోగులకి కూడా వర్తింప చేశారు). ఈ విధానంలో ఉద్యోగి ములవేతనం + డిఎ నుంచి 10% మినహాయింపు చేసి అంతే మొత్తం అనగా 10% ప్రభుత్వం కలిపి ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.( ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 14% కలుపుతుంది).ఇట్టి సొమ్మును పిఎఫ్ ఆర్డిఏ వివిధ పెన్షన్ ఫండ్ మరియు ఇతర సంస్థ లలో పెట్టుబడులు పెడుతుంది,ఇట్టి మొత్తం ఉద్యోగి రిటైర్ అయ్యేనాటికి ఒక ఫండ్ ఏర్పడుతుంది. ఉద్యోగి రిటైర్ అయ్యాక ఆ ఫండ్ నుంచి 60% నగదు ఒకే మొత్తం లో ఉద్యోగికి చెల్లింపు జరుగుతుంది మిగితా 40% పెన్షన్ రూపంలో ఉద్యోగికి ఒక వేళ ఉద్యోగి మరణిస్తే భాగస్వామికి చెల్లింపు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ కి డిఎ కానీ,పే రివిజన్ కానీ వర్తింపవు.
యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)
దేశం అంత ఎన్ పి ఎస్ పైన ఆందోళనలు జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వము కొత్త పెన్షన్ విధానం యుపిఎస్ తీసుకొచ్చింది. ఈ విధానం 01 ఏప్రిల్ 2025 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకి వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిలో చెరొచ్చు.ఇది రెండు పెన్షన్ విధాల కలయిక అని చెప్పవచ్చు.ఈ విధానంలో కనీసం 25 సంవత్సరాలు పని చేసిన ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి చివరి 12 నెలల వేతనం సగటు లో 50% పెన్షన్ గా ఇవ్వబడుతుంది. 25 సంవత్సరాల కన్నా తక్కువ 10 సంవత్సరంలకన్న ఎక్కువ ఉన్నట్లయితే వారి సర్వీస్ ఆధారంగా పెన్షన్ లెక్కించి పెన్షన్ ఇవ్వబడుతుంది అయితే ఈ లెక్కింపు లో పెన్షన్ 10 వేల కన్న తక్కువ ఉన్న కనీస పెన్షన్ 10 వేలు ఉంటుంది.10 సంవత్సరం లకన్న తక్కువ సర్వీస్ ఉంటే పెన్షన్ ఇవ్వబడదు.ఈ పెన్షన్ పెరిగిన డిఎ కి సర్దుబాటు చేయబడుతుంది. ఉద్యోగి మరణిస్తే భాగస్వామి కి పెన్షన్ ఇవ్వబడుతుంది. ఉద్యోగి వేతనం (బేసిక్ + డిఎ) నుంచి 10% మినహాయింపు జరుగుతుంది మరియు ప్రభుత్వం 18.5% మాచింగ్ నిధులు జమ చేస్తుంది. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి పూర్తి కాబడిన ప్రతి 6 నెలల వేతనంలో 1/10 వంతు మొత్తం ని ఉద్యోగికి ఒకే మొత్తం నగదుగా చెల్లింపు చేయడం జరుగుతుంది.ఈ విధానం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమె వర్తిస్తుంది.ఉద్యోగుల కి ఐచ్ఛికము ఉంటుంది కావాలి అనుకుంటే NPS ఎంపిక చేసుకోవచ్చు.
ఇలాంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీపిఎస్ వద్దు,యుపిఎస్ వద్దు – ఓపిఎస్ మాత్రమే కావాలి అని నినదిస్తున్నము…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం సిపిఎస్ ను రద్దు చేసి – ఒపిఎస్ (ఓపిఎస్)ను అమలు చేయలని అలాగే ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఉద్యోగ జేఏసీ నాయకత్వం బావిస్తుందని టిఇజేఏసీ సూర్యపేట చైర్మన్ షేక్.జానిమియ,సెక్రెటరీ జనరల్ డా.బి.గోపి లు ఇతర నేతలు తమ ప్రసంగంలో తెలియ జేశారు.పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా 45 తెలంగాణ ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల జేఏసి. నాయకులు టిఎన్జిఓఎస్ యూనియన్ జిల్లా కార్యదర్శి దున్న శ్యామ్,పిఆర్టియు టిఎస్ జిల్లా అధ్యక్షులు జ్యోతుల చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి చింత రెడ్డి రామలింగారెడ్డి,పత్రికా సంపాదక వర్గ సభ్యులు తంగేళ్ల జితేందర్ రెడ్డి,టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు
ఎన్ సోంబాబు,జి వెంకటయ్య,జె యాకయ్య,టిపిటిఎఫ్ పుప్పాల వీరన్న,డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు
రేపాక లింగయ్య,పి వెంకటేశ్వర్లు,టీపీయూటీ రాష్ట్ర అధ్యక్షులు మట్టపల్లి రాధాకృష్ణ,గుణగంటి కృష్ణ,టియుటిఎఫ్
కస్తూరి కిషన్ ప్రసాద్,అధ్యక్షులు
మామిడి అరవింద్,టిఆర్టిఎఫ్ జిల్లా అధ్యక్షులు గులాం జహంగీర్,
టీఎస్ సిపిఇయు జిల్లా అధ్యక్షులు
లక్కపాక ప్రవీణ్,గుణగంటి నరసింహ,జి ప్రసాద్,టీఎన్జీవోఎస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కే శేఖర్,వెంకన్న,అల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.