సీపీఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: డిఎం శ్రీనివాస్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 17 (ప్రతినిధి మాతంగి సురేష్): సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆర్టిసి డిపో మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో 108 సిబ్బంది ఆధ్వర్యంలో గుండె ఊపిరితిత్తుల పునర్జీవనం (సీపీఆర్) సందర్భంగా ఆర్టీసీ డిపోలో 108 సిబ్బంది 108 పిఎం సలీం, సూపర్వైజర్ శివరాం ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వంద మరణాల్లో పది మరణాలు ఆకస్మికంగా గుండె పోటుతో మరణిస్తున్నారని ఎవరైనా గుండె సమస్య తో మరణించినట్లయితే గుండె ఊపిరితిత్తుల పునర్జీవనం (సీపీఆర్) ద్వారా బ్రతికించవచ్చునని తెలిపారు. ఎక్కువగా ఆహార అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వలన గుండె పోటు వస్తుంది కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ,108 ఈఎంటి నాగేశ్వరరావు, పైలట్ రాంబాబు,



