సీపీఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: డాక్టర్ వీరేంద్రనాథ్
Mbmtelugunews//సూర్యాపేట, అక్టోబర్ 17(ప్రతినిధి మాతంగి సురేష్) :సిపిఆర్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ వీరేంద్రనాథ్ తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీఎస్ఆర్టీసీ బస్టాండ్లలో రైల్వేస్టేషన్లలో సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(యస్) మండల పరిధిలోని కందగట్ల ప్రభుత్వ పల్లె దావఖనలో సి పి ఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతి వంద మరణాల్లో పది మరణాలు ఆకస్మికంగా గుండె పోటుతో మరణిస్తున్నారని ఎవరైనా గుండె సమస్య తో మరణించినట్లయితే గుండె ఊపిరితిత్తుల పునర్జీవనం (సీపీఆర్) ద్వారా బ్రతికించవచ్చునని తెలిపారు. ఎక్కువగా ఆహార అలవాట్లు, వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడం వలన గుండె పోటు వస్తుందిదీనిపై అవగాహన పెంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఏఎన్ఎంలు సుజాత అరుణ అంజలి ఆశాలు లలిత జ్యోతి విజయ పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



